![]() |
![]() |
.webp)
ఎంటర్టైన్మెంట్ అనేది ఒక రాజ్యం అయితే. ఆ రాజ్యాన్ని ఏలే రారాజులు మన కమెడియన్లు . లెజెండరీ కమెడియన్స్ అందరిని గుర్తు చేసుకుంటూ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కమెడియన్ స్పెషల్ అని చెప్పాడు ప్రదీప్. నేను ఈరోజు క్యాన్ తెచ్చుకున్నా అన్నారు అలీ. " ఎ సర్ " అన్నాడు ప్రదీప్. "నవ్వుతుంటే ముత్యాలు రాల్తాయేమో ఏరుకుందామని " అంటూ శ్రీదేవి మీద సెటైర్ వేశారు. " ఒకసారి నవ్వితే " అనేసరికి శ్రీదేవి కూడా నవ్వేశారు." జడ్జెస్ కోసం ఇన్నోవేటివ్ గా ఉండాలని క్రాక్డైల్ కుకీస్ చేస్తున్నాను" అన్నాడు నిఖిల్ . " క్రోకడైల్ కుకీస్ తినేది మేమైనా కన్నీళ్లు మాత్రం నీకొచ్చేలా చూస్తే తినడానికి నేను రెడీ " అన్నారు సంజయ్ తుమ్మ. " దాని ముసలి కన్నీరంటరా" అంటూ ఆలీ అనేసారు . "మీ ముందుకి ఓ అద్భుతాన్ని తీసుకొస్తాను.
ఆ ఆర్ట్ చూసి ఆర్ట్ ఎవరు ఏసుంటారో గెస్ చేసి వేలం పాట పాడాలి. ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి ఆర్ట్ అది గీసిన ఆర్టిస్టు వాళ్ళకే " అంటూ ప్రదీప్ కుక్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. "మాకింకా పేమెంట్ రాలేదు. మాకొద్దులేండి. " అని తనూజ సెటైర్ వేసింది. "అందుకనే డబ్బుల్తో వేలం పాడట్లేదు. మీకేదైతే వంట చేయడానికి 60 నిమిషాలు టైమ్ ఇస్తామో అందులోంచి మీరు ఎంతో కొంత టైమ్ బయటికి తీసి ఈ వేలం పాట పాడాలి. " అన్నాడు ప్రదీప్. తర్వాత బిడ్డింగ్ మొదలయ్యింది. "ఫస్ట్ టైం ఒక జాతిరత్నం కోసం ఇంత ఫైట్ జరుగుతోంది " అన్నాడు ప్రదీప్. "ఇవాళ ఉంటది మీ అందరికీ. మాములుగా ఉండదు కదా " అన్నారు అలీ. "ఇంతకాలం ఆ పాత చింతకాయ పచ్చడి తిని తిని ఆ మొహాలు చూడలేక చచ్చాను. " అంది రోహిణి కోవై సరళ గెటప్ లో వచ్చి ." నేను న్యాయం చేస్తా" అన్నాడు సీరియల్ నటుడు శ్రవణ్. "ఒక్క నిమిషం న్యాయం చేస్తా " అంటున్నాడేంటి అంది రోహిణి.
తర్వాత అవినాష్ ఒక మూవీలోని ఆలీ గెటప్ లో వచ్చి "బాగున్నారా బాగున్నారా బాగున్నారా సవాధికా సావ కొడతా చావ కొడతా" అన్నాడు. " ప్రదీప్ నేను మసాజ్ చేస్తా" అంటూ ఆటపట్టించాడు. తర్వాత నూకరాజు శుభలేఖ సుధాకర్ గెటప్ లో వచ్చి "నేను కొత్తగా. వచ్చిన జాతిరత్నం కామెడీ చేయాలన్నది నా ప్రయత్నం. ఇంతకీ నా వాయిస్ ఎవరిదో గుర్తుపట్టు" అంటూ అడిగాగాడు. " సుధా సుధాకర్, ఐ లవ్ యూ అమ్మా" " అమ్మ ఎప్పుడూ అంతే వెంటనే చెప్పేస్తుంది" అంది రోహిణి . తరవాత సుహాసిని శ్రీలక్ష్మి గెటప్ లో వచ్చి " నన్ను కవిని కాదన్నోడిని కఱ్ఱుచ్చుకుని కొడతా" అంటూ వచ్చింది . "మరి నువ్వు కవి అన్నవాణ్ణి" అంటావు రోహిణి అడిగేసరికి "కవి అన్నవాడిని రాయుచ్చుకుని కొడతా " అంది. " మేడమ్ మీరు చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి గారి గారండీ " అని అడిగాడు ప్రదీప్ ."అవునండి " అంది సుహాసిని.
![]() |
![]() |